నల్గొండలో నేతాజీ జయంతి వేడుకలు
NLG: భారతరత్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని నేతాజీ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ నాయకుడు అల్లి సుభాష్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ పాత్ర శాశ్వతంగా ఉంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొలనుపాక రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.