విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: DDO
KDP: సచివాలయ సిబ్బంది తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని డివిజన్ డెవలప్మెంట్ అధికారి మైథిలి హెచ్చరించారు. గురువారం చెన్నూరు ఎంపీపీ సభా భవనంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 11ను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని, సర్వేలను వందశాతం పూర్తి చేయాలని సూచించారు.