బాలికలకు హెచ్పీవీ టీకాల పంపిణీ
JGL: కథలాపూర్ మండలం అంబారిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. బాలికలకు గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు ముందస్తుగా ఈ టీకా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 15 మంది బాలికలకు టీకా వేసినట్లు వైద్యాధికారి రచన తెలిపారు. ఎంపీడీవో, హెచ్ఐవో, వైద్య సిబ్బంది ఉన్నారు.