రామకృష్ణాపూర్‌లో 'ఇంటింటికి సీపీఐ' కార్యక్రమం ప్రారంభం
MNCL: CPI ప్రజా పోరాటాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు శంకర్ కోరారు. రామకృష్ణాపూర్‌లో 10 రోజుల పాటు సాగే 'ఇంటింటికి సీపీఐ' కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతామన్నారు.