విజయోత్సవ ర్యాలీలు నిషేధం: ఎస్పీ
జగిత్యాల జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అనవసర గుంపులు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.