గవర్నర్ పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్
SRPT: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాక సందర్భంగా కోదాడలోని కేఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో నవోదయ పాఠశాల భవన నిర్మాణ శంకుస్థాపన స్థలాన్ని శనివారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పరిశీలించారు. అధికారులు ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేయాలని, అప్రోచ్ రోడ్లు, శిలాఫలకం, వేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో సూర్యనారాయణ ఉన్నారు.