'ఆన్‌లైన్ ద్వారానే ఇకపై ఇసుక అందించాలి'

'ఆన్‌లైన్ ద్వారానే ఇకపై ఇసుక అందించాలి'

ASF: జిల్లాలో “మన ఇసుక వాహనం" పోర్టల్ ద్వారా పూర్తిగా పారదర్శకంగా ఆన్‌లైన్ బుకింగ్‌తోనే ఇసుక సరఫరా చేయాలని కలెక్టర్ హరిత సూచించారు. శనివారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. ఆన్‌లైన్ ద్వారానే ఇసుక అందించాలన్నారు. అక్రమ రవాణా నివారణకు అధికారులు సమన్వయంతో పని చేయాలని, గ్రామస్థాయిలో బాధ్యతలు స్పష్టంగా నిర్వర్తించాలన్నారు.