కోసిగిలో 12 ఆటోలపై కేసు నమోదు
కర్నూలు: పరిమితికి మించి కూలీలు ఆటోలో వెళ్తున్న 12 ఆటోలపై కేసు నమోదు చేసినట్లు కోసిగి ఎస్ఐ రమేశ్ రెడ్డి తెలిపారు. కోసిగిలో పత్తి తీయడానికి కూలీలను పరిమితికి మించి తీసుకెళ్తున్న ఆటోలను తనిఖీల్లో భాగంగా 12 ఆటోలను గుర్తించి, వాటిపై కేసు నమోదు చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ ధరించి ప్రయాణించాలని ఎస్ఐ పేర్కొన్నారు.