సిర్పూర్(టి) రేంజ్ పరిధిలో పెద్దపులి సంచారం

సిర్పూర్(టి) రేంజ్ పరిధిలో పెద్దపులి సంచారం

ASF: సిర్పూర్(టి) రేంజ్ పరిధి మాలిని, ఇటిక్యాల పహాడ్ గ్రామాల సరిహద్దుల్లో పెద్దపులి సంచరిస్తోంది. మాలిని అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. మాలిని నుంచి ఇటిక్యాల పహాడ్ గ్రామ పరిసరాలకు వెళ్లినట్లు నిర్ధారించారు. సిర్పూర్ (టి)రేంజ్ పరిధిలోని మాలిని, ఇటిక్యాల పహాడ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని FRO ప్రవీణ్ కుమార్ ప్రకటనలో తెలిపారు.