కంభంలో చల్లగా మారిన వాతావరణం

కంభంలో చల్లగా మారిన వాతావరణం

ప్రకాశం: కంభం పట్టణంలో ఆదివారం సాయంత్రం వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి ఉక్కపూతకు అల్లాడిన ప్రజలు, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారడంతో కొంతమేర ఉపశమనం పొందారు. మధ్యాహ్నం వరకు సుమారు 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, ఇప్పుడు వాతావరణం మారి చెల్లటి గాలులు వీస్తుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.