పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు: బొడ్డు

పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు: బొడ్డు

E.G: కోరుకొండలో జిల్లా టీడీపీ అధ్యక్షులు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసే నివాళులర్పించారు. అనంతరం సీనియర్ టీడీపీ నాయకులను ఘనంగా సత్కరించారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసిన ఘనత ఎన్టీఆర్ ప్రభుత్వానిదేనని తెలిపారు.