ప్రకృతి వరప్రసాదం.. కొల్లేరు సరస్సు

ప్రకృతి వరప్రసాదం.. కొల్లేరు సరస్సు

ELR: ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా మన కొల్లేరు సరస్సు ప్రత్యేకత చాటుకుంటోంది. ఈ సరస్సు అంతర్జాతీయ 'రామ్సర్ సైట్' గుర్తింపు పొందింది. శీతాకాలంలో సైబీరియా, ఫిలిప్పీన్స్ దేశాల వలస పక్షులకు ఇది సురక్షిత నిలయం. ముఖ్యంగా ఆటపాక పక్షుల కేంద్రంలో కనిపించే పెలికన్లు, పెయింటెడ్ స్టార్క్స్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆధ్యాత్మికంగానూ కొల్లేటికోట పెద్దింట్లమ్మ ఆలయం ఇక్కడ ఎంతో ప్రసిద్ధి.