వీధులు బురదమయం

TPT: బండారుపల్లి గ్రామ పంచాయతీలో గత 40 రోజులుగా కడవీధి, నడివీధి, మిల్లి వీధులు బురదమయమయ్యాయి. పురుగులతో మగ్గిన నీళ్లల్లో స్కూల్ పిల్లలు, వృద్ధులు నానా అవస్థలు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. పంచాయతీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కొద్దిరోజులుగా అంటువ్యాధులు ప్రబలుతున్నాయని జ్వరాలతో బాధపడుతున్నారని చెప్పారు.