VIDEO: క్రీడలు మానసిక వికాసానికి ఎంతో దోహదం: ఎమ్మెల్యే
SKLM: క్రీడలు శారీరక, మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయి అని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు. సోమవారం ఏపీ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడల సమాఖ్య (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్-19 బాలబాలికల క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి రాష్ట్ర, దేశ జట్లకు ప్రాతినిధ్యం వహించాలని అన్నారు.