'సీసీటీవీలతోనే నేరాలను అరికట్టవచ్చు'

'సీసీటీవీలతోనే నేరాలను అరికట్టవచ్చు'

ADB: సీసీటీవీలతోనే నేరాలను అరికట్టవచ్చునని ఉట్నూర్ ASP కాజల్ సింగ్ పేర్కొన్నారు. గుడిహత్నూర్ మన్నూరు గ్రామంలో గురువారం స్థానిక పోలీసులతో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు, ఆటో, మ్యాక్స్‌ను స్వాధీన పరుచుకున్నట్లు వెల్లడించారు. గంజాయి వాడకం, పండించడం వలన కలిగే ఇబ్బందులను ప్రజలకు వివరించినట్లు తెలియజేశారు.