'కల్వర్టు పునరుద్ధరణ చేయండి'

VZM: సంతకవిటి మండలం వాసుదేవపట్నం పంచాయతీ పోతుల జగ్గుపేట గ్రామం వద్ద చిత్తారపురం, సంతకవిటి ప్రధాన రహదారిపై గల కల్వర్టు కుంగిపోయిందని స్థానికలు తెలిపారు. ఈ రహదారి వెంట నారాయణపురం బ్రిడ్జి ద్వారా శ్రీకాకుళం వెళ్లడానికి ప్రయాణికులు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు. అధికారులు త్వరితగతిన కల్వర్టు పునరుద్ధరణ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.