ఓకే కుటుంబం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపు
MHBD: తొర్రూరు మున్సిపాలిటీ 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో తూనం శ్రావణ్ కుమార్ మేనమామ భార్య కౌన్సిలర్‌గా గెలుపొందారు. 2వ సారి శ్రావణ్ తల్లి ఇదే వార్డు నుంచి విజయం సాధించారు. ఇప్పుడు అదే పరంపరను కొనసాగిస్తూ, శ్రావణ్ కుమార్ బరిలో నిలిచి భారీ మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు. ఓకే కుటుంబం వరుసగా మూడుసార్లు గెలుపొందడం గమనార్హం.