మీలో ఈ క్వాలిటీస్ ఉన్నాయా?
మహిళల్లోని కొన్ని ప్రత్యేక గుణాలు పురుషులను ఎక్కువగా ఆకర్షిస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. మనస్ఫూర్తిగా నవ్వడం, స్వతంత్రంగా ఉంటూనే ఇతరుల పట్ల దయ చూపడం, మనసులో ఉన్నది నిక్కచ్చిగా చెప్పడం వంటి లక్షణాలను పురుషులు ఇష్టపడతారు. అలాగే జీవితంలో స్పష్టమైన లక్ష్యం కలిగి ఉండి, తమ కలల కోసం కృషి చేసే మహిళలకు పురుషులు త్వరగా ఫిదా అవుతారని నిపుణులు పేర్కొంటున్నారు.