కరుణించిన గంగమ్మకు.. వరద పాశం

NRPT: సమృద్ధిగా వర్షాలు కురిసి ఊట్కూరు పెద్ద చెరువు అలుగు పారడంతో మత్స్యకారులు గంగమ్మ తల్లికి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ సాగునీటి సంఘం అధ్యక్షుడు కుంటిమారి లక్ష్మన్న ఇంటి వద్ద వరద పాశం వండి డబ్బు చప్పుల నడుమ ఊరేగింపుగా చెరువు అలుగు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ గంగమ్మకు పూజలు చేసి నైవేద్యంగా వరద పాయశాన్ని నీటిలోకి వదిలారు.