నగరంలో కార్మికుల భారీ నిరసన ప్రదర్శన

KMM: పని గంటల పెంపును వ్యతిరేకిస్తూ, కనీస వేతనం పెంపు, పెన్షన్ డిమాండ్లు, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ ఖమ్మంలో TUCI ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్ వరకు కొనసాగింది. కార్మికులు తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. కార్మిక హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.