VIDEO: ఢిల్లీలో బాంబు పేలుళ్లు.. జిల్లాలో భద్రత కట్టుదిట్టం
NLG: ఢిల్లీలో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో సోమవారం రాత్రి పోలీసులు భద్రత చర్యలు కట్టుదిట్టం చేశారు. క్లాక్ టవర్ సెంటర్ వద్ద వాహనాలు ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నల్గొండలోని ప్రధాన కూడళ్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.