విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి మృతి

విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి మృతి

VZM: బొండపల్లి మండలం అంబటివలస గ్రామంలో శనివారం తాపీమేస్త్రి తాళ్లపూడి అప్పలనాయుడు (35) ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది మామిడిచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.