నేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన
NGKL: ఉప్పునుంతల మండలంలో ఇవాళ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ అనంత్ రెడ్డి తెలిపారు. ఉప్పునుంతల మండలంలోని మామిళ్ల పల్లి గ్రామంలో లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు హాజరుకానున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్కొంటారు.