నర్సంపేట పట్టణంలో క్యాన్సర్ వల్ల బస్టాండ్ లోనే మృతి

వరంగల్: నర్సంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లోనే ఒకరు మృతి చెందారు. వరంగల్ కు చెందిన మహ్మద్ అర్జల్(35) నర్సంపేటలో ఓ పండ్ల వ్యాపారి వద్ద కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. క్యాన్సర్తో బాధపడుతున్న అర్జల్ వరంగల్ కు వెళ్లి వస్తూ నర్సంపేటలో బస్సు దిగాడు. స్పృహ తప్పి బస్టాండులోనే నిద్రపోయాడు. ఆర్టీసి సిబ్బంది వచ్చి అతనిని నత్నించగా అప్పటికే మృతి చెందాడు.