అభివృద్ధికి స్వచ్ఛంద సేవ సంస్థల తోడ్పాటు అభినందనీయం

NDL: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛంద సేవ సంస్థల తోడ్పాటు అభినందనీయమని ఎంఈఓ సోమశేఖర్ అన్నారు. గురువారం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ జడ్పీ హైస్కూల్లో విద్యార్థుల సౌకర్యార్థం జ్ఞాన నిది సేవా సంస్థ ఆధ్వర్యంలో తాగునీటి మోటార్‌ను బహుకరించారు. ఆయా సందర్భాల్లో విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్న సేవా సంస్థ సభ్యుల సేవలను కొనియాడారు.