విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్

విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్

BDK: విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. పాల్వంచ బోలోరిగూడెం బీసీ బాలుర వసతి గృహాన్ని ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న ఆహారం, వసతి, ఇతర సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం స్టోర్ రూమ్ను తనిఖీ చేసి బియ్యం, పప్పులు నిత్యావసర సరుకుల నిల్వలను, నాణ్యతను పరీక్షించారు.