చండూరులో పందుల బెడద

NLG: చండూరులో పందుల బెడద ఎక్కువై ప్రజలను భయపెడుతోంది. అంగడిపేట, బంగారిగడ్డ, బోడంగిపర్తి వంటి గ్రామాల్లో పందులు గుంపులుగా తిరుగుతున్నాయి. స్వైన్ ప్లూ, మెదడువాపు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదముందని ప్రజలు భయపడుతున్నారు. పంచాయితీ చట్టం ప్రకారం పందులను జనావాసాల నుంచి దూరంగా ఉంచాలని నిబంధన ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.