హరిలాల్ మృతి బాధాకరం: ఎమ్మెల్యే బాలునాయక్
NLG: దేవరకొండ మండలం శేరిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బతాండకు చెందిన రామావత్ హరిలాల్ మృతి బాధాకరం అని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. శుక్రవారం హరిలాల్ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు. ఎమ్మెల్యే తోపాటు మాజీ సర్పంచ్ లచ్చ్య నాయక్, గోపాల్ సింగ్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.