నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

BDK: అల్లపల్లి, గుండాల, ఇల్లందు, మండలాల్లో 132 కేవి సబ్ స్టేషన్‌లో అత్యవసర మరమ్మత్తుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు బుధవారం పేర్కొన్నారు. సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.