బొలెరో డ్రైవర్‌పై కేసు నమోదు'

SRCL: అతివేగంగా బండి నడిపి ఒకరి మరణానికి కారణమైన బొలెరో డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని తంగళ్లపల్లి ఎస్ఐ ఉపేంద్ర చారి తెలిపారు. ఈనెల 25న ద్విచక్ర వాహనంపై సిరిసిల్ల నుంచి సిద్దిపేటకు వెళ్తున్న కొంగరి నరేశ్ (35)ను సిద్దిపేట నుంచి సిరిసిల్లకు వెళ్తున్న నడిపి నరేశ్ బొలెరోతో ఢీకొట్టాడన్నారు. ప్రమాదంలో నరేశ్ తల పగిలి అక్కడికక్కడే మరణించాడని చెప్పారు.