'కొరియన్ కనకరాజు'.. ఉగాది లుక్ అదిరింది!
వరుణ్ తేజ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కొరియన్ కనకరాజు’ నుంచి ఉగాది స్పెషల్ అప్‌డేట్ వచ్చింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హర్రర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రేడియో పట్టుకున్న వరుణ్ తేజ్ లుక్ ఆకట్టుకుంటోంది. త్వరలోనే మ్యూజికల్ జర్నీ మొదలుకానుందని చిత్ర బృందం హింట్ ఇచ్చింది. ప్రస్తుతం కొరియాలో చిత్రీకరణ జరుగుతోంది.