అందెశ్రీకి జిల్లాతో ప్రత్యేక అనుబంధం
KMM: ప్రముఖ రచయిత, కవి అందెశ్రీ మరణం సాహిత్య రంగాన్ని విషాదంలో ముంచింది. ఆయనకు ఖమ్మంతో ప్రత్యేక అనుబంధం ఉంది. నెలనెల వెన్నెల 65వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అందెశ్రీ, మాయమవుతున్న మనిషి విలువలపై చేసిన ప్రసంగం, పాడిన పాటను పలువురు నెమరేసుకున్నారు. ఆయన మృతిపై నెలనెల వెన్నెల నిర్వాహకులు సంతాపం తెలిపారు.