ఇరాన్‌పై యుద్ధం.. అమెరికా పోస్ట్

ఇరాన్‌పై యుద్ధం.. అమెరికా పోస్ట్

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగిస్తున్నాయి. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పేరుతో చేస్తున్న ఈ దాడులను అమెరికా తాజాగా పంచుకుంది. యుద్ధం తొలి 100 గంటల వీడియోను యూఎస్ సెంట్రల్ కమాండ్ పోస్టు చేసింది. ఇందులో వాయువేగంతో దూసుకెళ్తున్న విమానాలు, యుద్ధ నౌకల నుంచి క్షిపణుల ప్రయోగాల దృశ్యాలు ఉన్నాయి. కాగా, ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం నేటికి ఆరు రోజులకు చేరింది.