'ప్రభుత్వం చేపట్టిన సర్వే ఆదర్శంగా నిలుస్తోంది'
HYD: దేశంలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, బీసీ అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వే ఒక ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సుమారు 1.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగులతో 1.12 కోట్ల ఇళ్లను సర్వే చేసి, 3.55 కోట్ల ప్రజల వివరాలను పారదర్శకంగా సేకరించిందన్నారు.