ఏటీఎం కార్డులు మార్చుతూ చోరీ.. నిందితుడు అరెస్టు
E.G: ఏటీఎంల వద్ద నగదు విత్ డ్రా చేసే క్రమంలో అమాయకులను నమ్మించి కార్డులు మార్చి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అనపర్తి పోలీసులు అరెస్టు చేసినట్లు DSP విద్యా తెలిపారు. నెల్లూరుకు చెందిన ఫణీంద్ర గతంలోనూ పలు నేరాలకు పాల్పడ్డారని, అతని వద్ద నుంచి 10 ATM కార్డులు, ఒక కారు, రూ.3 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.