మాతంగీదేవి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు
KDP: చెన్నూరు మండలం కాశీపురం శ్రీ శ్యామల మాతంగీదేవి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు బోలా వెంకట సుబ్బయ్య గురువారం తెలిపారు. ప్రతి శుక్రవారం ఉదయం ప్రత్యేక అభిషేకం, అలంకరణ, విశేష పూజ, సాయంత్రం సామూహిక కుంకుమార్చన, అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నారు. భక్తులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.