వీరజవాన్ చిత్రపటానికి మాజీ మంత్రి నివాళి

SS: గోరంట్ల మండలం కల్లితండా గ్రామానికి చెందిన వీర జవాన్ మురళి నాయక్ పాక్ దాడుల్లో మరణించిన విషయం తెలిసిందే. శనివారం మాజీ మంత్రి శంకర్ నారాయణ వారి ఇంటికి వెళ్లి వీర జవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మురళీ నాయక్ మృతి చెందడం చాలా బాధాకరం అన్నారు. అనంతరం వారి తల్లిదండ్రులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.