చెస్ టోర్నమెంట్‌లో సాయి విధాత్రికి 4వ స్థానం.!
MDK: తెలంగాణ రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్‌లో పట్టణానికి చెందిన సాయి విధాత్రి నాలుగవ స్థానం దక్కించుకుంది. పెద్దపల్లిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర స్థాయి క్రీడలు, ఎంపికలు నిర్వహించారు. మెదక్ పట్టణానికి చెందిన విజయ్ కుమార్-దివ్యల కూతురైన సాయి విధాత్రి గతంలోనూ అనేక చెస్ పోటీల్లో బహుమతులు సాధించింది.