అంబులెన్స్‌లో మహిళలకు ప్రసవం
SRD: మహిళ 108 అంబులెన్స్‌లో ప్రసవం జరిగిన సంఘటన గురువారం హత్నూర మండలం బోర్పట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుజాతకు పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ గ్రామానికి వచ్చి సుజాతను ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు ఎక్కువగా రావడంతోనే మార్గం మధ్యంలోనే ప్రసవం చేశారు.