కురుమూర్తి స్వామి హుండీ ఆదాయం రూ.28.70 లక్షలు
MBNR: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం తొలి హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ హుండీ ద్వారా దేవస్థానానికి రూ.28,70,536 నగదు ఆదాయం లభించినట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్ జి.గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ స్పెషల్ ఆఫీసర్ రఘునాథ్, పాలకమండలి సభ్యులు, లక్ష్మీనరసింహ సేవాసమితి మహిళలు పాల్గొన్నారు.