మండలలో తనిఖీలు నిర్వహించిన ఎంపీడీవో

మండలలో తనిఖీలు నిర్వహించిన ఎంపీడీవో

కోనసీమ: జిల్లాలో గొర్రిపూడిలో మండల అభివృద్ధి అధికారి ఎం. అనుపమ ఇవాళ పర్యటించారు. వర్షాల నేపథ్యంలో ఎక్కడా నీటి నిల్వలు లేకుండా, చెత్తకుప్పలు లేకుండా పారిశుద్ధ్యాన్ని పాటించాలని ఆమె ఆదేశించారు. అలాగే సురక్షితమైన తాగునీటిని అందించాలని, ప్రజలు కాచి వడపోసిన నీటిని తాగాలని సూచించారు. గ్రామ కార్యదర్శి వీరబాబు చేపడుతున్న కార్యక్రమాలను ఆమెకు వివరించారు.