చెట్టుపై ప్రేమతో..

NLR: చెట్టుపై ప్రేమతో దానిని తొలగించకుండానే ఇల్లు కట్టుకున్నాడో ప్రకృతి ప్రేమికుడు. సీతారామపురం మండలం పబ్బులేటిపల్లికి చెందిన పెద్దకాశయ్య కొన్నాళ్ల క్రితం ఇల్లు నిర్మించుకున్నాడు. ప్రాణంగా పెంచిన కొబ్బరి చెట్టు తొలగించకుండా ఇల్లు కట్టుకున్నాడు. ప్రకృతిపై ప్రేమతో, చెట్లపై మమకారంతో మొక్కలు నాటి పెంచుతున్నాడు.