VIDEO: కేతకి సమీపంలో వాగు ఉగ్రరూపం

SRD: ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయం సమీపంలో శనివారం వాగు ఉరకలేస్తుంది. భారీ వర్షం కారణంగా ఆలయానికి ఎగువ నుంచి వరద ఉధృతి తీవ్రం కావడంతో కాలువలో నీళ్లు పట్టక పక్కనే ఉన్న ఆలయం ప్రాంగణంలోకి వరద జలాలు దూసుకుపోయాయి. దాంతో స్థానిక పోలీసులు అధికారులు అప్రమత్త చర్యలు తీసుకొని, ఆలయం వైపు ఎవరు రాకుండా చర్యలు తీసుకున్నారు.