పురుగుల మందు తాగి జర్నలిస్టు శ్రీనివాస్ మృతి
MHBD: నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మద్దెల శ్రీనివాస్ గౌడ్ (45) గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.