VIDEO: బైక్ తో ఢీకొని.. వ్యక్తి పరార్

VIDEO: బైక్ తో ఢీకొని.. వ్యక్తి పరార్

కృష్ణా: ఉయ్యూరు శ్రీనివాస కాలేజీ వంతెన సమీపంలో ఆదివారం ఓ బైక్ పాదచారుని ఢీకొట్టింది. ఈ ఘటనలో కెసీపీ కాలనీకి చెందిన వ్యక్తి కాలు విరిగి, తీవ్రంగా గాయపడ్డాడు. అతని కాలు సంఘటన స్థలంలోనే విరిగిపోగా, స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. బైక్ డ్రైవర్ ప్రమాదం అనంతరం వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.