నకిలీ ఆర్ఎంపీపై కేసు నమోదు
BHNG: నకిలీ ఆర్ఎంపీని ఎస్వోటీ పోలీసులు యాదగిరిగుట్టలో పట్టుకున్నారు. సుదర్శన్ ఆర్ఎంపీగా పట్టణంలోని శ్రీ సాయి పేరుతో ఆసుపత్రిని ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నాడు. సమాచారంతో గురువారం రాచకొండ ఎస్వోటీ పోలీసులు ఆసుపత్రిని పరిశీలించి, ఎలాంటి సర్టిఫికెట్లు లేకపోవడంతో అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నకిలీ ఆర్ఎంపీపై కేసు నమోదు చేసినట్లుగా సీఐ భాస్కర తెలిపారు.