'నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం'
SKLM: నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ నుంచి మంజూరైన 1.71 లక్షల చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ఆశాకిరణంగా మారిందని అన్నారు.