భద్రకాళి ఆలయంలో విశేష పూజలు
WGL: వరంగల్ భద్రకాళి ఆలయంలో శుక్లపక్షం పురస్కరించుకొని వేకువజాము నుంచే ఆధ్యాత్మిక సందడి నెలకొంది. తెల్లవారుజామున 5 గంటలకు సుప్రభాత సేవతో ఆలయ ద్వారాలు తెరిచిన అర్చకులు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి పాలాభిషేకం, పంచామృతాభిషేకాలను వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు శేషు ఆధ్వర్యంలో వేద పండితులు సామూహిక కుంకుమార్చనలు చేపట్టారు.