బీజేపీ జెండాను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో బీజేపీని మరింత పటిష్టం చేయాలని, సైద్ధాంతిక దృక్పథంతో కార్యకర్తలు పనిచేయాలని కోరారు. జిల్లాలో పార్టీ కార్యకలాపాలను విస్తృతపరచాలన్నారు.