'ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి'

SKLM: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా పోర్ట్ పోలియో జడ్జి సుబ్బారెడ్డి, జిల్లా కోర్టు జడ్జి జూనైద్ మహమ్మద్ మౌలానా అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. చెట్లు వాతావరణ సమతుల్యతకు దోహదపడతాయన్నారు. 1వ అదనపు జిల్లా జడ్జి భాస్కరరావు, 3వ అదనపు జిల్లా జడ్జి వివేకానంద శ్రీనివాస్, 4వ అదనపు జిల్లా జడ్జి పని కుమార్ పాల్గొన్నారు.